తెలుగు తెరపై తారాజువ్వలా దూసుకొచ్చిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వరుస విజయాలతో అలరిస్తున్న ఈ ఢిల్లీ డాల్ అతి తక్కువ కాలంలో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. పర్ఫెక్ట్ సెక్సీ ఫిగరు కల ఈ హీరోయిన్ ను చూస్తే అమ్మాయిలు కూడా ఈర్ష్య పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో రకుల్ ప్రీత్ వివరించింది.
వారంలో ఆరు రోజుల పాటు ప్రతి రోజూ గంట సమయం వర్కౌట్ చేస్తాను. కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్స్ వంటివి నా వర్కౌట్ లో తప్పనిసరిగా ఉంటాయి. షూటింగ్లతో బిజీగా ఉన్నా వర్కౌట్ చేయడం మాత్రం మర్చిపోను. ఒకవేళ ఏ రోజైనా వర్కౌట్ చేయకపోతే మూడీగా ఉంటుంది, డల్ అయిపోతాను. తర్వాత ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను. ప్రతి రోజూ కరెక్ట్ టైంకి తింటాను. ఇంట్లో వండిన ఆహారం ఎక్కువగా తీసుకుంటాను. పీతలు, కూరగాయలు, పండ్లు తింటాను. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, వేపుడులకు నేను చాలా దూరం. నా షూటింగ్ త్వరగా పూర్తయితే ఆ రోజు రెండోసారి వర్కౌట్ చేస్తాను. అని రకుల్ ప్రీత్ వివరించింది. సో, ఎవరైనా అమ్మాయిలు నాజూకైన ఫిగర్ కావాలనుకునే రకుల్ ప్రీత్ సింగ్ ను ఫాలో అయిపోండి.


