మనసు మార్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్

మనసు మార్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Published on Sep 9, 2019 12:00 AM IST

ఈమధ్య స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగలేదు. గత రెండేళ్లలో చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ పరాజయాలే. హిందీలో నటించిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం విజయం సాదించగా తెలుగులో చేసిన ‘మన్మథుడు 2’ తమిళంలో చేసిన ‘ఎన్.జీ.కె’ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో రకుల్ ఆలోచనలో పడింది.

వీలుంటే ఇకపై ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని అనుకుంటోంది. గతంలో కూడా తాను ఫీమేల్ పాత్రలకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు చేశానని, అవార్డ్ విన్నింగ్ సినిమాలు చేయాలనే కోరిక ఉందని, నిర్మాతలకు లాభాలు వస్తాయనే నమ్మకం ఉంటేనే అలాంటి సినిమాలు చేస్తానని అంటోంది.

ఇక అప్పటి వరకు కమర్షియల చిత్రాల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్ సినిమాలో, శంకర్ ‘ఇండియన్ 2’లో హిందీలో ‘మర్జవాన్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు