రకుల్ సినిమాల రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ఆమె మేనేజర్.!

Published on Nov 25, 2020 8:13 pm IST


అతి తక్కువ కాలంలోనే మన టాలీవుడ్ లో మంచి స్టార్డం ను సంపాదించుకున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. యోంగ్ హీరోలతోనే తన ప్రయాణం మొదలు పెట్టినా దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ ఈమె సినిమాలు చేసేసింది. కానీ మెల్లగా తర్వాత గట్టి పోటీ రావడంతో ఫేడ్ అవుట్ కావడం మొదలు పెట్టింది.

అదే విధంగా ఫిజికల్ గా కూడా చాలా చేంజ్ అయ్యిపోయింది. పైగా ఆ మధ్య కొన్ని లీగల్ సమస్యలు కూడా లేవనెత్తాయి. దీనితో ఆమె సినిమాలపై ప్రభావం గట్టిగా పడింది అని పలు రూమర్స్ మొదలయ్యిపోయాయి. దీనితో ఆమె ఎన్ని సినిమాలు చేస్తుంది అన్న అంశంపై ఆమె మేనేజర్ జి హరినాథ్ ఒక క్లుప్తమైన క్లారిటీని ఇచ్చారు.

ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్ అండ్ చంద్ర శేఖర్ యేలేటి కాంబోలో వస్తున్న థ్రిల్లర్ “చెక్” చిత్రం అలాగే ఇంకా టైటిల్ ఖరారు కాని క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలో నటిస్తుందని తెలిపారు. అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో ఒక సినిమా చేస్తుందని తెలిపారు. ఇక బాలీవుడ్ లో అయితే చాలా సినిమాలు ఉన్నాయి అది కూడా అగ్ర హీరోలతోనే ఉన్నట్టుగా వారు తెలిపారు.

అర్జున్ కపూర్ తో ఒక సినిమా అలాగే బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తో “అటాక్” అనే మరో సినిమా ఇక వీటితో పాటుగా లేటెస్ట్ గా “మే డే” అనే బిగ్ ప్రాజెక్ట్ కు ఆమె సైన్ చేసారని అతను తెలిపాడు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ ఆలాగే అమితాబ్ బచ్చన్ లు మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. మొత్తానికి ఇన్ని సినిమాలను రకుల్ చేస్తుంది అని ఆమె సినిమాల విషయంలో వస్తున్న రూమర్స్ పై ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చి చెక్ పెట్టారు.

సంబంధిత సమాచారం :

More