నేను స్మోక్ చెయ్యను, డ్రగ్స్ తీసుకోలేదు – రకుల్

Published on Sep 30, 2020 2:12 pm IST

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే డ్రగ్స్ మాఫియా విషయంలో ఇరుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి ఈ రచ్చ పెద్ద ఎత్తున అలా అన్ని సినీ వర్గాల్లో సంచలనం రేపుతూ వస్తుంది. అయితే ఆమెకు చాలా పెద్ద వ్యక్తులతో ఈ విషయంలో సంబంధం కూడా ఉందని ఎన్నో రకాల ఆరోపణలు వినిపించాయి. దీనితో రకుల్ ఢిల్లీ హై కోర్టును కూడా అప్రోచ్ అయ్యింది.

అక్కడ నుంచి ఈ కేసులో చాలా మంది పేర్లే బయటకొచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆమె కోర్టుకు సబ్మిట్ చేసిన స్టేట్మెంట్ లో తాను ఒక నాన్ స్మోకర్ ను అని అలాగే తాను ఎప్పుడూ కూడా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొంది. ఇప్పటికే ఆమెపై విచారణ కూడా జరిగిన సంగతి తెలిసిందే. వీటి మూలాన ఇప్పటికే ఈమె నటిస్తున్న ప్రాజెక్టులు బ్రేక్ పడ్డాయి. మరి రకుల్ కు ఎప్పుడు ఉపశమనం కలుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More