రామ్ తో రొమాన్స్ చేయనున్న రాకుల్!

Rakul-Preet
తెలుగు లో రాకుల్ ప్రీత్ సింగ్ ఒక సినిమా తరువాత మరో సినిమా ఒప్పందాల పై సంతకాలు చేస్తున్నారు. కేవలం ఒక్క సినిమా విజయంతో ఆమె ప్రస్తుత హీరోయిన్ల సరసన చేరి పోయారు. తాజాగా రామ్ తరువాతి చిత్రం పండగ చేస్కో లో హన్సిక స్దానం లో ఆమె నటించనుందని సమాచారం. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇది వరకే కందిరీగ లో నటించిన రామ్, హన్సిక లు ఈ చిత్రం తో మళ్ళీ వారి జోడీని రిపీట్ చేస్తారని అనుకున్నారు. అయితే హన్సిక కు డేట్స్ కుదరక పోవటం తో ఈ చిత్రం నుంచి తప్పుకుంది. తమిళ, తెలుగులలో హన్సిక ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం రవితేజ పవర్ చిత్రంలో నటిస్తోంది. రామ్ తో కలిసి నటించనుండటం తో రాకుల్ చాలా థ్రిల్ గా ఫీల్ అవుతోంది. రామ్ సరసన ఆమె ప్రధాన పాత్రను పోషించనుంది. ఈ చిత్రానికి సంబందించిన చాలా భాగం అమెరికా లో షూటింగ్ జరుపుకోనుంది.

రాకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం కాకుండా మంచు మనోజ్ తదుపరి చిత్రం కరెంటు తీగ, గోపీచంద్ మరో చిత్రంలో ఆమె నటిస్తోంది.

Exit mobile version