
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేస్తున్న ‘టెంపర్’ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా జనవరిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జోడీ కట్టే హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని పరిశీలిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే సుకుమార్ రకుల్ ప్రీత్ సింగ్ ని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం వరుస హిట్స్ అందుకొని లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంవత్సరం పలు పెద్ద సినిమాలతో టాప్ హీరోయిన్స్ లిస్టులోకి వెళ్ళిపోనుంది. ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. టెంపర్ షూట్ ఫినిష్ అవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. టెంపర్ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

