‘నాన్నకు ప్రేమతో’ లండన్ షెడ్యూల్ పూర్తిచేసిన రకుల్!

‘నాన్నకు ప్రేమతో’ లండన్ షెడ్యూల్ పూర్తిచేసిన రకుల్!

Published on Sep 18, 2015 8:34 AM IST

NTR-rakul-pretty
తెలుగు సినీ పరిశ్రమలో తాజా సంచలనంగా మారిపోయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మొదట వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా విజయంతో తెలుగులో పాగా వేసిన ఈ హీరోయిన్, అతి కొద్దికాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోన్న రకుల్, ఈ మూడు సినిమాల బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‍తో బిజీబిజీగా మారిపోయారు.

ఇక ఈ మూడు ప్రాజెక్టుల్లో ఒకటైన ఎన్టీఆర్-సుకుమార్‌ల ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత కొద్దిరోజులుగా లండన్‌లో భారీ ఎత్తున జరుతూన్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ నిన్ననే లండన్ షెడ్యూల్‌లో తన పార్ట్ పూర్తి చేసుకొని తిరిగి హైద్రాబాద్ ప్రయాణమయ్యారు. కొంత విరామం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’, అల్లు అర్జున్ – భోయపాటిల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలతో రకుల్ బిజీ కానున్నారు. ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతి రిలీజ్‌కు ఫిక్స్ కాగా, రామ్ చరణ్ ‘బ్రూస్‍లీ’ దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు