‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సక్సెస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోస్ సరసన వరుసగా సినిమాలు చేస్తోంది. రకుల్ ప్రీత్ ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన ‘పండగ చేస్కో’ సినిమాలో నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కోసం కొన్ని లాంగ్ డైలాగ్స్ రాసారు. ‘నా లైఫ్ లో బాగా కష్టమైన, అత్యంత పొడవైన డైలాగ్ ని ఇప్పుడే పండగ చేస్కో కోసం పూర్తి చేసాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని’ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా కాకుండా గోపిచంద్ సరసన ఓ సినిమా, మనోజ్ సరసన ‘కరెంట్ తీగ’ సినిమా, ఆది ‘రఫ్’ సినిమాల్లో నటిస్తోంది.


