అడ్వెంచర్ సినిమాలో నటించనున్న హీరో రామ్ !

అడ్వెంచర్ సినిమాలో నటించనున్న హీరో రామ్ !

Published on Mar 14, 2018 2:13 PM IST


రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమాలో రామ్ హీరోగా నటించబోతున్నాడు. గరుడవేగా తరహాలోనే ఈ సినిమాను భారి బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి చెయ్యడం జరిగింది.

ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్‌ ప్రస్తుతం త్రినాద్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారు సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో. అడ్వెంచర్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఫుల్ యాక్షన్ సినిమాగా ఉండబోయే ఈ మూవీ చిత్రీకరణ అధికభాగం ఫారిన్ లో జరగబోతోంది. త్వరలో ఈ సినిమాను ప్రకటించబోతున్నాడు నిర్మాత ఆనంద్ ప్రసాద్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు