నిజమైన మెగాస్టార్‌ను కలిశానంటున్న చరణ్

నిజమైన మెగాస్టార్‌ను కలిశానంటున్న చరణ్

Published on Sep 8, 2019 7:10 PM IST

Ram Charan

పనిచేసే సినిమా పట్ల, ఆ సినిమాను నిర్మించే నిర్మాత పట్ల మెగాస్టార్ చిరంజీవి గౌరవం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనలోని ఆ క్వాలిటీనే ఆయన్ను మెగాస్టార్‌ను చేసిందని ఆయనతో పనిచేసిన ప్రతి నిర్మాత చెబుతుంటారు. ఇప్పుడు అదే మాటను చిరు కుమారుడు రామ్ చరణ్ చెబుతున్నారు.

ప్రస్తుతం చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి రామ్ చరణే నిర్మాత. భారీ వ్యయంతో సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా మొదలై పూర్తయ్యేవరకు చిరు, చరణ్ ఇద్దరూ తండ్రీ కొడుకుల్లా కాకుండా నిర్మాత, హీరోలానే ఉన్నారట. ఆ సమయంలోనే చరణ్ చిరులోని నిజమైన కమిట్మెంట్ ఎలాంటిదో చూశారట.

ఈ విషయాన్నే చెబుతూ సినిమా కోసం నాన్నకు నిర్మాతగా మారిన తర్వాతే నేను ఆయనలోని నిజమైన మెగాస్టార్‌ను కలిశాను అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 2న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

https://www.instagram.com/p/B2JjgGmneI9/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు