మిరాయ్: ది బ్లాక్ స్వార్డ్ గ్లింప్స్ పై రామ్ చరణ్ కామెంట్స్!

మిరాయ్: ది బ్లాక్ స్వార్డ్ గ్లింప్స్ పై రామ్ చరణ్ కామెంట్స్!

Published on May 20, 2024 10:00 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిరాయ్. ఈ చిత్రం లో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా మిరాయ్ చిత్రం లో తన రోల్ ది బ్లాక్ స్వార్డ్ కి సంబందించిన గ్లింప్స్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

గ్లింప్స్ వీడియో ను చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో వీడియో ను షేర్ చేస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ స్వార్డ్ చూడటానికి బాగుంది అని, స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది అని పేర్కొన్నారు. అంతేకాక మిరాయ్ చిత్రం ను చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. గౌర హరి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 18, 2025న 7 భాషల్లో సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు