చిరంజీవితో పాటే రామ్ చరణ్, బన్నీ !
Published on Jun 9, 2018 4:01 pm IST


మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ డెబ్యూ చిత్రం ‘విజేత’ టాకీ పార్ట్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ లో కూడ పాల్గొంటున్నారు. జూలై నెలలో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి కళ్యాణ్ దేవ్ లాంచ్ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

సినిమా వేడుకను ఈ నెల 24న జరపనున్నారు. ఈ వేడుకకు ముందు నుండి అనుకుంటున్నట్టే మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా ఆయనతో పాటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడ హాజరుకానున్నారని వినికిడి. దీన్నిబట్టి మెగా అల్లుడికి మెగా హీరోల ప్రోత్సాహం పూర్తిస్థాయిలోనే ఉందని అర్థమవుతోంది.

నూతన దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా మాళవిక నాయర్ నటిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook