సూపర్ పిక్ : తాతయ్య 90వ బర్త్ డే వేడుకల్లో చరణ్, ఉపాసన

సూపర్ పిక్ : తాతయ్య 90వ బర్త్ డే వేడుకల్లో చరణ్, ఉపాసన

Published on Feb 5, 2023 8:12 PM IST


ఇటీవల దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ విజయంతో హీరోగా గ్లోబల్ గా ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో RC 15 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు రామ్ చరణ్. అయితే విషయం ఏమిటంటే, అపోలో సంస్థల అధినేత మరియు ఉపాసన తాతయ్య అయిన ప్రతాప్ రెడ్డి 90వ పుట్టిన రోజు వేడుకల్ని నేడు ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన అనంతరం తాతయ్య ప్రతాప్ రెడ్డి దంపతులతో కలిసి రామ్ చరణ్, ఉపాసన ఒక సూపర్ పిక్ దిగారు.

కాగా ఈ పిక్ ని కొద్దిసేపటి క్రితం చరణ్ తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. గొప్ప ఆలోచనలు, ధాతృత్వ గుణంతో ఎందరో హృదయాలు గెలిచిన మీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి అంటూ చరణ్ తన పోస్ట్ లో తెలిపారు. ఇక ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు