హాట్ టాపిగ్గా మారిన రామ్ చరణ్, విజయేంద్ర ప్రసాద్

vijayendra prasad ram chara
మన టాలీవుడ్ సినిమా గర్వించదగ్గ భారీ చిత్రం చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రంతో ఇరు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా గ్లోబల్ వైడ్ గా కూడా మంచి సెన్సేషన్ ని సెట్ చేశారు. మరి ఇలాంటి పవర్ఫుల్ సబ్జెక్టు ని తెరకెక్కించింది జక్కన్న రాజమౌళి అయితే దానిని సృష్టించింది మాత్రం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని తెలిసిందే.

అయితే జస్ట్ కొన్ని రోజులు నుంచి కూడా మళ్ళీ సోషల్ మీడియాలో విజయేంద్ర ప్రసాద్ చేసిన పలు కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం అంతా రామ్ చరణ్ సహా విజయేంద్ర ప్రసాద్ లు ఇద్దరి పేర్లు కూడా మంచి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ సహా చరణ్ అన్నా కూడా విజయేంద్ర ప్రసాద్ కి ఎంత ఇష్టం అనేది ఎన్నో సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ విషయంలో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ కార్నర్ చేయడం మరింత వేడి పుట్టించింది. ఇక దీనితో ఎందుకో మళ్ళీ రామ్ చరణ్ పేరుతో పలు వీడియోలు సోషల్ మీడియాలో విజయేంద్ర ప్రసాద్ తన “శ్రీవల్లి” చిత్రం నుంచి మాట్లాడినవి కూడా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయంలో విజయేంద్ర ప్రసాద్ ని అలాగే రాజమౌళిని కూడా లాగుతుండడం భావ్యం కాదని న్యూట్రల్ ఆడియెన్స్ సూచిస్తున్నారు.

Exit mobile version