
అల్లు శిరీష్, రెజినా జంట గా నటించిన కొత్త జంట చిత్రం మే 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించారు. ఈ చిత్ర ప్రమోషన్ ను బాగానే చేసిఈ చిత్ర బృందం , చిత్ర విజయం మీద నమ్మకంగా ఉన్నారు.
ఈ చిత్రాన్ని చూసిన రామ్ చరణ్ ఈ చిత్ర బృందాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయన్ని అతని పేస్ బుక్ పేజి లో తెలిపారు. ‘ఇప్పుడే కొత్తజంట సినిమా ను చూసాను. ఈ చిత్రంతో శిరీష్ పూర్తి స్దాయి నటుడుగా మారారు, డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని చాలా బాగా తీసారు. గీతా ఆర్ట్స్ బృందానికి నా అభినందనలు’ అని రామ్ చరణ్ తెలిపారు. దీంతో మెగా అభిమానుల్లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
జేబీ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.