ఇండియన్ హెర్క్యులస్ గా రామ్ చరణ్.. గ్లోబల్ ప్లానింగ్?

ఇండియన్ హెర్క్యులస్ గా రామ్ చరణ్.. గ్లోబల్ ప్లానింగ్?

Published on Feb 13, 2024 9:00 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు భారీ చిత్రం “గేమ్ చేంజర్” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత యంగ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో చరణ్ 16వ చిత్రం చేస్తుండగా ఈ సినిమా విషయంలో మాత్రం మరింత ఆసక్తికర వాతావరణం నెలకొంది.

ఈ చిత్రం ఉత్తరాంద్ర నేపథ్యంలో చెందిందే అని దర్శకుడు కూడా ఫిక్స్ చేసాడు. అయితే ఇది వస్తావా సంఘటనల ఆధారంగా కూడా తెరకెక్కుతుంది అని టాక్ ఉంది. మరి అటువైపు ఉన్న కొందరి పవర్ ఫుల్ పర్సనాలిటీస్ లో శ్రీకాకుళంకి చెందిన బాహుబల శాలి ఇండియన్ హెర్క్యులస్ గా పిలవబడే కోడి రామమూర్తి గారు కూడా ఒకరు.

అయితే తన జీవిత చరిత్రపైనే ఈ చిత్రం ఉంటుంది అని చరణ్ అయన రోల్ నే పోషిస్తున్నాడని ఇది వరకే రూమర్స్ వచ్చాయి. మరి ఇప్పుడు మరోసారి ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చరణ్ కి ఉన్న గ్లోబల్ ఇమేజ్ లో ఈ సినిమానే చేస్తే ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఎందుకంటే కోడి రామమూర్తి గారి జీవితంలో అప్పట్లోనే ప్రపంచ ఆడియెన్స్ నివ్వెరపోయిన అంశాలు అనేకం ఉన్నాయని చెబుతారు.

ఆ ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదునే విదేశీయులు పెట్టారని నానుడి. కానీ అలాంటి వ్యక్తికి ఇప్పుడు సరైన గుర్తింపు లేదని వారి ప్రస్తుత కుటుంబీకులు ఆవేదన పడుతున్నారు. సో ఇపుడు చరణ్ కి ఉన్న ఫేమ్ లో గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువయ్యేందుకు ఇదే సినిమా చేస్తే మంచి ఆస్కారం తప్పకుండా ఉంటుంది పైగా అలాంటి లెజెండరీ పర్సనాలిటీని కూడా మరోసారి ప్రపంచానికి పరిచయం చేసినట్టు ఉంటుంది అని చెప్పాలి. కానీ సినిమా నేపథ్యంపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు