
మెగా ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అయిన మెగాస్టార్ 60వ పుట్టిన రోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. 21వ తీదీ సాయంతం మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో కలిసి బర్త్ డే కేక్ కట్ చేసాడు, ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ లో బర్త్ డే సెలబ్రేషన్స్, చివరిగా పార్క్ హయత్ లో సెలబ్రిటీస్ నడుమ చిరు బర్త్ డే బాష్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలన్నిటినీ దగ్గరుండి చూసుకోవడం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 9వ సినిమా షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చాడు. ముఖ్యంగా చరణ్ – ఉపాసన ఆర్గనైజ్ చేసిన చిరు 60వ బర్త్ డే బాష్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ వేడుకల కోసం గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ నేటి నుంచి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమ న్యూ షెడ్యూల్ నేటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. నేటి నుంచి కంటిన్యూగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఈ చిత్ర టీం మరో షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనుంది. చిరు బర్త్ డే కానుకగా వచ్చిన టీజర్ ప్రస్తుతం అందరి నుంచి రీ సౌండ్ అదిరిపోయిందనే టాక్ ని తెచ్చుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

