టీమ్ “విశ్వంభర” కి రామ్ చరణ్ బెస్ట్ విషెస్!

టీమ్ “విశ్వంభర” కి రామ్ చరణ్ బెస్ట్ విషెస్!

Published on Jan 17, 2024 11:02 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ చిత్రం ను కాన్సెప్ట్ వీడియో ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీడియో కి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ కాన్సెప్ట్ వీడియో పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కాన్సెప్ట్ వీడియో నిరీక్షణ ను రేకెత్తించింది అని, అంతేకాక తనకి ఆసక్తికరంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు.

యంగ్ డైరెక్టర్ వశిష్ట, యూవీ క్రియేషన్స్, మెగాస్టార్ చిరంజీవి మరియు ఎం ఎం కీరవాణి కి బెస్ట్ విషెస్ తెలిపారు. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో ఆడియెన్స్ ముందుకి రానుంది ఈ సినిమా. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు