పిక్ టాక్ : బాబాయ్‌కి మెగా పవర్ బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్

పిక్ టాక్ : బాబాయ్‌కి మెగా పవర్ బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్

Published on Sep 2, 2026 2:00 PM IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఆయనకు స్పెషల్ విషెస్ తెలిపాడు.

“గౌరవనీయులైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఎక్స్ వేదికగా తన ప్రేమాభిమానాలను పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ తనకు ఎల్లప్పుడూ ఒక గొప్ప ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడని రామ్ చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తన బాబాయ్ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, సంతోషంతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన సంవత్సరాలు గడపాలని ఆకాంక్షించాడు.

“లవ్ యూ బాబాయ్” అంటూ రామ్ చరణ్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మెగా అభిమానులతో పాటు నెటిజన్లను ఈ బాబాయ్-అబ్బాయ్‌ల అనుబంధం ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు