అర్ధరాత్రి గొడవపై స్పందించిన రామ్ చరణ్..!

Ram-Charan-
మెగాస్టార్ చిరంజీవి తనయుడు, ప్రముఖ హీరో రామ్ చరణ్.. శనివారం అర్ధరాత్రి తన ఇంటి వద్ద ఇచ్చిన పార్టీ వివాదాస్పదం అయ్యింది. మరో ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలతో కలిసి రచ్చ రచ్చ చేశారంటూ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై రామ్ చరణ్ పేస్ బుక్ లో స్పందించారు.

‘ఇంటి వద్ద జరిగిన ఒక సింపుల్ ఫ్యామిలీ డిన్నర్ పార్టీని.. ఓ పెద్ద గానా భాజానాతో జరిగిన వేడుకగా చిత్రీకరించిన తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా చుట్టుపక్కల(నైబర్స్) వారిని, వారి వ్యక్తిగత స్వేఛ్చ(ప్రైవసీ)ను మేము గౌరవిస్తాం. త్వరలో ప్రచారంలో ఉన్న ఈ ఊహాజనిత కథనాలకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ తన అఫీషియల్ పేస్ బుక్ లో రామ్ చరణ్ పోస్ట్ చేశారు.

Exit mobile version