‘ఆచార్య’లో చరణ్ పాత్రపై క్రేజీ అప్డేట్.. అస్సలు మిస్ కాకండి !

Chiru Ram

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. కొన్నిరోజులు చిరు లేకుండానే షూటింగ్ చేశారు కొరటాల శివ. తాజాగా చిరు షూటింగ్లో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు మీద యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. కాగా సినిమాలో రామ్ చరణ్ కూడ ఒక కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లపాటు చరణ్ చేయబోయేది కేవలం అతిధి పాత్రమేనని, కొద్దిసేపే స్క్రీన్ మీద కనిపిస్తారని అనుకుంటూ వచ్చారు. కానీ చరణ్ ఇందులో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాత్ర నిడివి ఏంతనేది తెలియలేదు కానీ సినిమాలో చాలా సేపు ఉంటుందని మాత్రం తెలుస్తోంది.

ఒకవేళ ఇదే నిజమై చిరు, చరణ్ సినిమా మొత్తం కలిసి కనిపిస్తే అభిమానులకు అంతకంటే గొప్ప ఐఫీస్ట్ మరొకటి ఉండదనే చెప్పాలి. ఈ సినిమా కోసం చెర్రీ నెల రోజులు డేట్స్ కేటాయించారట. జనవరి నుండి ఆయన షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఈ చిత్రంలో చిరు దేవాదాయశాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించనుంది. ఇంకొద్దిరోజుల్లో ఆమె కూడ షూటింగ్లో జాయిన్ కానుంది. అలాగే మరొక హీరోయిన్ రెజీనా సినిమాలో ఓక్ స్పెషల్ సాంగ్ చేయనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2021 మొదటి అర్థభాగంలోనే ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

Exit mobile version