
‘గోవిందుడు అందరివాడేలే’ లాంటి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. మామూలుగా తనతో పనిచేసిన నిర్మాతలంతా చరణ్ నిర్మాతల నటుడని అంటుంటారు. శ్రీనువైట్ల సినిమా విషయంలో చరణ్ మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాడు. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాకి నిర్మాత డివివి దానయ్య కానీ రామ్ చరణ్ దగ్గరుండి ప్రొడక్షన్ విషయంలో కేర్ తీసుకుంటున్నాడు.
తాజాగా ఈ చిత్ర సెట్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ బడ్జెట్ ఎక్కువ కాకూడదని, అనుకున్న దాని ప్రకారం 35 నుంచి 40 కోట్ల లోపే ఈ సినిమాని పూర్తి చెయ్యాలని, రెమ్యూనరేషన్ విషయంలో కూడా అందరినీ కంట్రోల్ లో ఉండేలా చూసుకోవడమే కాకుండా, షూటింగ్ డేస్ ని కూడా ఎక్కువ కాకుండా అనుకున్న దాని ప్రకారం 70-80 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ కోసం శ్రీను వైట్ల కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ కలగలిపిన ఓ పర్ఫెక్ట్ కథని సిద్దం చేసాడు. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను స్పెయిన్ లోని అందమైన లోకేషన్స్ లో షూట్ చేస్తున్నారు.
రామ్ చరణ్ – రాకుల్ ప్రీత్ సింగ్ లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సాంగ్ షూటింగ్ తర్వాత ఈ చిత్ర టీం హైదరాబాద్ లో మేజర్ షెడ్యూల్ ని మొదలు పెట్టనుంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించిన ఈ సినిమాలో కృతి కర్బంద, నదియాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.