కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తున్న చరణ్ !

17th, April 2018 - 09:26:53 AM

ఇటీవలే ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తర్వాతి సినిమా కోసం సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటీకే మొదలుకాగా చరణ్ ఈ నెలాఖరు నుండి షూట్లో పాల్గొననున్నారు.

ఈ లోపు కథలోని తన పాత్రకు తగ్గట్టు శరీరాన్ని మలుచుకుంటున్నాడు చెర్రీ. ఇందుకోసం తన సతీమణి ఉపాసన పర్యవేక్షణలో ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ కసరత్తులు చేస్తున్నారు. ‘రంగస్థలం’లో మోటుగా పల్లెటూరి యువకుడిలా కనబడిన చరణ్ ఈ సినిమాలో మాత్రం స్టైలిష్ మెకోవర్లో కనిపించనున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.