రామ్ చరణ్ కి మరో ఇంటెర్నేషనల్ అవార్డ్.!

రామ్ చరణ్ కి మరో ఇంటెర్నేషనల్ అవార్డ్.!

Published on Dec 9, 2023 12:00 PM IST

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కన్నా ముందు చరణ్ నటించిన “రౌద్రం రణం రుధిరం” తర్వాత అయితే తనకి గ్లోబల్ వైడ్ గా మరింత క్రేజ్ వచ్చింది. అలాగే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా తనకి రాగా లేటెస్ట్ గా అయితే తనకి మరో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినట్టుగా తెలుస్తుంది.

మరి యూఎస్ కి చెందిన ఇంటర్నేషనల్ అవార్డ్స్ పాప్ గోల్డెన్ అవార్డ్స్ వారు ఇండియన్ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్స్ నామినేషన్స్ లో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా అయితే గెలుచుకున్నట్టుగా అనౌన్స్ చేసారు. దీనితో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ సీఈఓ కూడా చరణ్ ని కలవడంతో గ్లోబల్ గా చరణ్ క్రేజ్ మరింత పెరుగుతుంది అని సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు