
ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా. అన్నీ అనుకున్నట్టుగా జరిగుంటే చిరు 150వ సినిమా ఆయన బర్త్ డే కానుకగా ఆగష్టు 22న మొదలు కావాలి. కానీ పర్ఫెక్ట్ స్టొరీ ఇంకా కుదరకపోవడంతో ఈ సినిమా కాస్త వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం చిరంజీవి, అలాగే చిరు 150వ సినిమాని నిర్మించబోయే రామ్ చరణ్ పర్ఫెక్ట్ కథని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. చిరు 150వ సినిమా మరియు అ సినిమాలో రంక్ హరన్ ఉంటాడా లేదా అన్న విషయంపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.
రీసెంట్ గా రామ్ చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘అనుకున్న దాని ప్రకారం అయితే చిరు 150వ సినిమాని ఆగష్టు 22న అనౌన్స్ చేయాల్సింది. కానీ ఓ సినిమా రీమేక్ రైట్స్ కోసం ట్రై చేసాం. దానికి అనుకున్న టైం కంటే ఎక్కువ టైం తీసుకోవడం వలన కుదరలేదు. త్వరలోనే చిరు 150వ సినిమాపై క్లారిటీ ఇస్తాం. అలాగే నేను కూడా నాన్న గారి 150వ సినిమాలో ఓ పాత్రలో కనిపిస్తాను. కానీ నేను కనిపించేది కాసేపు మాత్రమే, మెయిన్ రోల్ మాత్రం ననగారిదే అని’ రామ్ చరణ్ తెలిపాడు. దీఎని ప్రకారం చిరు 150వ సినిమా ఓ సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అవ్వచ్చు లేదా ఓన్ తెలుగు స్టొరీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

