
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చరణ్ అండ్ టీం ఈ సినిమా ప్రిమియర్ షోస్ మరియు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తమిళ హిట్ మూవీ తని ఓరువన్ రీమేక్ లో నటించనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పర్ఫెక్ట్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండే పోలీస్ థ్రిల్లర్ కథాంశం. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరైన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.
ఇంతకీ రామ్ చరణ్ గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఎలాంటి సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు అనే విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్యూర్ లవ్ స్టొరీ చెయ్యడానికి ఇష్టపడుతున్నాడట. మాస్ హీరోగా కంటిన్యూగా సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ చేంజోవర్ కోసం గోవిందుడు అందరివాడేలే అనే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసాడు, ఇప్పుడు మళ్ళీ లవర్ బాయ్ ఇమేజ్ కోసం గౌతమ్ మీనన్ ని ఓ ప్రేమ కథ సిద్దం చేయమని చెప్పినట్లు సమాచారం. గౌతమ్ మీనన్ యాక్షన్ సినిమాలైనా, లవ్ స్టోరీస్ అయినా చాలా డిఫరెంట్ గా చేస్తాడనే పేరుంది. కావున రామ్ చరణ్ – గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఓ సూపర్బ్ క్రేజీ లవ్ స్టొరీని ఆశించవచ్చు. మరి ఫైనల్ గా సెట్స్ పైకి వెళ్ళే టైంకి చరణ్ ఒపీనియన్ మార్చుకుంటాడా లేక లవ్ స్టొరీకె ఫిక్స్ అవుతాడా అన్నది చూడాలి.