యాక్షన్ లోకి దిగిన రామ్ చరణ్.!

యాక్షన్ లోకి దిగిన రామ్ చరణ్.!

Published on Feb 20, 2024 8:02 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ మరియు అంజలి లు హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా శంకర్ సినిమా షూటింగ్ ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమాలో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి ఓ టాక్ ఉంది.

మరి ఈ సీక్వెన్స్ ని ఈరోజు రామ్ చరణ్ తో శంకర్ స్టార్ట్ చేశారు. దీనితో రామ్ చరణ్ కొంత కాలం టాకీ పార్ట్ తర్వాత సాలిడ్ యాక్షన్ లోకి దిగాడని చెప్పాలి. మరి శంకర్ మార్క్ లో ఈ సీక్వెన్స్ లు ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు