మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు.
అమరావతిలోని ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్’ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు వెళ్తూ.. మార్గమధ్యంలో రామ్ చరణ్ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను కలిశాడు.
ఈ ఇద్దరు మెగా హీరోల కలయికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తర్వాత పవన్‌ను రామ్ చరణ్ కలవడంతో అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to… pic.twitter.com/xavBCDx9zK
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2026


