
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ – కామెడీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడే ఈ సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యడానికి డేట్ ని ఫిక్స్ చేసారు. కానీ ఒక స్టార్ హీరో సినిమాని కేవలం 5 నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ చేయడం కష్టం అని ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి.
ఇదే విషయాన్నీ ఈ చిత్ర ప్రొడక్షన్ టీం దగ్గరికి తీసుకెళ్లినప్పుడు వారు.. సినిమా ఏ మాత్రం ఆలస్యం అవ్వదు. చెప్పినట్టుగానే అక్టోబర్ 15న రిలీజ్ చేస్తాం. అందుకే ఈ చిత్ర టీం ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తోంది. రామ్ చరణ్ కూడా టీంకి ఎంతో సహకరించి దగ్గరుండి షూటింగ్ ఆన్ టైం అయ్యేలా చూసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ విషయంలో రామ్ చరణ్ అతని టీం చాలా హ్యాపీగా ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాస్త గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల – కోన వెంకట్ – గోపి మోహన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. డివివి దానయ్య నిర్మాత.

