‘పెద్ది’ ర్యాంపేజ్.. అక్కడ పెరుగుతున్న స్పీడ్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి ఇప్పుడు రాబోతున్న చిత్రమే ‘పెద్ది’. పాన్ ఇండియా లెవెల్లో గట్టి ప్రమోషన్స్ జరుపుకుంటూ ఇప్పుడు రిలీజ్ దగ్గరకి వస్తున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఈ చిత్రం బుకింగ్స్ ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ లో మొదలు కాగా అక్కడ బుకింగ్స్ ఓపెన్ అయ్యిన కొన్ని గంటల్లోనే రికార్డు రెస్పాన్స్ ఈ చిత్రానికి వచ్చింది.

అయితే తర్వాత కొంచెం స్లో అయ్యిన పెద్ది ఇప్పుడు మరోసారి ర్యాంపేజ్ చూపిస్తుంది. ఈ రెండు మూడు రోజుల్లోనే ఒకో రోజులు 50 వేల డాలర్స్ గ్రాస్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన పెద్ది ఇపుడు సగం రోజులోనే ఈ మార్క్ ని నార్త్ అమెరికా బుకింగ్స్ లో అందుకుని 7 లక్షల డాలర్స్ కి చేరుకుంది. దీనితో మళ్ళీ బుకింగ్స్ స్పీడ్ పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఈజీగా డే 1 కి 2 మిలియన్ మార్క్ ని ఈ చిత్రం దాటేస్తుందని చెప్పవచ్చు. మరి ఇక్కడ నుంచి మూమెంట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Exit mobile version