సైరా నుండి స్పెషల్ సాంగ్ రాబోతుంది !

సైరా నుండి స్పెషల్ సాంగ్ రాబోతుంది !

Published on Nov 5, 2019 9:00 PM IST

Syeraa1

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం కోసం తొలి సమరం ప్రారంభించిన వీరుడి కథ కావడం, ఆ పోరాటం కోసం ప్రాణాల్నే అర్పించడంతో ‘సైరా’ చిత్రం ఒక దేశభక్తుడి చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినిమా చూసిన అందరూ కూడా తప్పక చూడాల్సిన చిత్రం అని మెచ్చుకున్నారు.

అయితే ఈ సినిమా రన్ టైమ్ చాలా ఎక్కువగా ఉన్నందున.. సైరా నుండి ఒక ప్రత్యేక పాటను ఫైనల్ అవుట్ ఫుట్ లో పెట్టలేదనే విషయం చాలామందికి తెలియదు. అయితే, ఈ పాట కోసం చాలా ఖరీదైన సెట్స్ వేసి చాల ఖర్చు చేసి తీశారు. ఈ పాటలో చిరంజీవి మరియు తమన్నా నటించారు. కాగా ఇప్పుడు ఈ పాటను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు