దురదృష్టవశాత్తు మీ అంచనాలను అందుకోలేకపోయాం – రామ్ చరణ్ !

Published on Feb 5, 2019 12:00 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సంక్రాంతి సీజన్ లో విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది. బ్లాక్ బ్లాస్టర్ మూవీ రంగస్థలం తో నటుడిగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన రామ్ చరణ్ నుండి ఇలాంటి సినిమా రావడం ఆయన ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేపోయారు. ఇక సినిమా విడుదలయ్యాక దీని ఫలితంఫై స్పందించడానికి కూడా ఎవరు ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయారు. అయితే తాజాగా చరణ్ ఈ సినిమా ఫై స్పందిస్తూ ఒక లేఖను విడుదలచేశారు.

సినిమా కోసం చాలా కష్టపడ్డాం ఎంతగానో శ్రమపడి మిమ్మల్ని అలరించాలని మేము చేసిన ఈ ప్రయత్నం దురదృష్టవశాత్తు సక్సెస్ కాలేకపోయింది. మీరు చూపించే ప్రేమను ప్రేరణగా తీసుకొని ఇక ముందు మీరు మెచ్చే సినిమాలు చేసేలా కృషి చేస్తానని చరణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం :