గేమ్ ఛేంజర్: హైదరాబాద్ కి వచ్చేసిన రామ్ చరణ్!

గేమ్ ఛేంజర్: హైదరాబాద్ కి వచ్చేసిన రామ్ చరణ్!

Published on May 3, 2024 11:41 PM IST

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ రెండు రోజుల షూటింగ్ కోసం చెన్నై వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నటుడు షూట్‌ను పూర్తి చేసి ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చేశాడు. తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు