‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత కాస్త అగప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచీ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నాడు. యాక్షన్ – కామెడీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర దారులపై వచ్చే ముఖ్య సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ మొదలైన సమయంలోనే మూవీని అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చరణ్ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తూ, అనుకున్న టైం కి రిలీజ్ చెయ్యాలని ప్రొడక్షన్ టీంకి చెబుతున్నాడు. అందులో భాగంగానే రామ్ చరణ్ కూడా టీంకి ఎంతో సహకరించి దగ్గరుండి షూటింగ్ ఆన్ టైం అయ్యేలా చూసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ విషయంలో రామ్ చరణ్ అతని టీం చాలా హ్యాపీగా ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాస్త గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల – కోన వెంకట్ – గోపి మోహన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.


