‘పెద్ది’ మాస్ జాతర మొదలు.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారనే విషయంపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

‘పెద్ది’ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు రాబోయే ట్రైలర్ సినిమా కథాంశంపై మరింత స్పష్టతనిస్తుందని భావిస్తున్నారు. ‘పెద్ది మీ గుండెల్లో నిలిచిపోతుంది’ అంటూ మేకర్స్ ఇస్తున్న భరోసా చూస్తుంటే, ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో మరో ఎమోషనల్ అండ్ మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా కనిపిస్తోంది.

వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. చరణ్ ఊర మాస్ లుక్, వినూత్నమైన క్రికెట్ షాట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version