వైరల్ అవుతున్న చరణ్ స్టన్నింగ్ పిక్చర్.!

Published on Sep 24, 2020 7:59 am IST

మన టాలీవుడ్ అగ్ర తారల నుంచి కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు బయటకొస్తే క్షణాల్లో అవి మాస్ వైరల్ అవుతుంటాయి. జస్ట్ కాజువల్ ఫొటోస్ అయినప్పటికీ వాటిలో ఉండే ఏదొక ప్రత్యేకత అలా చేస్తుంది. అదే విధంగా ఇపుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ షేర్ చేసిన ఒక ఫోటో సినీ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోలో కెమెరా పట్టుకొని ఉన్న చరణ్ లుక్ మాత్రం చాలా షార్ప్ అండ్ స్టన్నింగ్ గా ఉందని చెప్పాలి.

అల్లూరి గెటప్ లో ఉన్న మీసపు కట్టు అన్నిటికి మించి తీక్షణమైన కంటి చూపు మరింత స్థాయిలో ఆకట్టుకుంటుంది. దీనికి గాను చరణ్ ఒక క్యాప్షన్ ను కూడా పెట్టారు. “నీలోని బెస్ట్ వెర్షన్ గానే ఎప్పుడు ఉండాలి” అని లైన్ పెట్టి మరింత ఉత్తేజపరిచారు. దీనితో ఈ ఫోటో నిన్న రాత్రి నుంచి మంచి వైరల్ అవుతుంది. ప్రస్తుతం చరణ్ మెగా మల్టీ స్టారర్ లు మెగాస్టార్ చిరు మరియు కొరటాల కాంబోలో “ఆచార్య” అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శక ధీరుడు రాజమౌళి తో “RRR” చిత్రాల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More