ఈమధ్య తెలుగులో రీమేక్ సినిమాల ట్రెండ్ పెరిగిపోయింది. మలయాళంలో సక్సెస్ అయిన సినిమాలను ఇక్కడ పెద్ద హీరోలే రీమేక్ చేసేస్తున్నారు. ఇప్పటికే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్, దృశ్యం 2, లూసిఫర్’ లాంటివి రీమేక్ అవుతుండగా తాజాగా ఇంకోక హిట్ సినిమా రీమేక్ కావడానికి రెడీ అవుతోంది. అదే ‘డ్రైవింగ్ లైసెన్స్’. ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్ చరణ్ ఛాన్నాళ్ల క్రితమే కొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ కథనే రవితేజతో చేయాలని చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రవితేజ ఒరిజినల్ వెర్షన్లో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను చేస్తారని, ఇంకొక కీలక పాత్ర కోసం పెద్ద నటుడిని తీసుకోవాలనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనే విషయం తేలలేదు. ప్రజెంట్ రవితేజ ‘ఖిలాడి’ సినిమాతో బిజీగా ఉన్నారు. దాని తర్వాత త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఒకవేళ రీమేక్ సినిమా గనుక ఉంటే ఇవన్నీ పూర్తయ్యాకే అది మొదలవుతుంది. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
