రామ్ చరణ్ తో కొరటాల శివ సినిమా ఫిక్స్ ?

రామ్ చరణ్ తో కొరటాల శివ సినిమా ఫిక్స్ ?

Published on Feb 7, 2022 4:04 PM IST

క్లాస్ డైరెక్టర్ కొర‌టాల శివ‌, మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా పూర్తి అయిన తర్వాత, కొరటాల చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తాడట. రచయితగా ఉన్న సమయలోనే చరణ్ కి కొరటాల ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి మిర్చి సినిమా తర్వాతే.. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలి.

కానీ, అప్పుడు సినిమా స్టార్ట్ అయి ఆగిపోయింది. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ ఫిక్స్ అయింది. అన్నట్టు కొరటాల ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం, కొరటాల చరణ్ తోనే సినిమా చేస్తున్నాడట.

మరి హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల, చరణ్ కోసం ఎలాంటి కథ రాశాడో. ఏది ఏమైనా వీరి కలయికలో వచ్చే సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు