“ఆచార్య” సెట్స్ లో చరణ్ అడుగు పెట్టేది అప్పుడే.!

Published on Nov 26, 2020 5:30 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న బిగ్ మల్టీ స్టారర్ అండ్ పీరియాడిక్ డ్రామా “RRR”లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తుండడంతో ఈ మల్టీ స్టారింగ్ చిత్రంపై ఎనలేని హైప్ నెలకొంది. ఇక ఇదిలా ఉంటే చరణ్ ఈ చిత్రంతో పాటి మరి బిగ్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

అదే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న “ఆచార్య”. అనేక రకాల సస్పెన్సుల అనంతరం ఈ రోల్ చరణ్ చేస్తున్నాడని కన్ఫర్మ్ కావడంతో భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు చరణ్ ఈ చిత్రం షూట్ లో ఎప్పుడు పాల్గొంటాడో అన్న దానిపై క్లారిటీ వస్తుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చరణ్ వచ్చే జనవరి మూడో వారంలో ఆచార్య సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడట.

చరణ్ పై ఉన్న కొన్ని కీలక షాట్స్ ను కొరటాల దర్శకత్వం వహించనున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా ఆ తర్వాత చిరు మరియు చరణ్ ల నడుమ షాట్స్ ను తీస్తారని టాక్. మొత్తానికి మాత్రం ఈ క్రేజీ కాంబోపై మాత్రం చాలానే అంచనాలు ఉన్నాయి. అలాగే మణిశర్మ సంగీతం కావడం మరో బిగ్ ఎస్సెట్ గా నిలిచింది. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి రేస్ లో విదుల్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More