ఏప్రిల్ నుండి బి-టౌన్లో రామ్ చరణ్

ఏప్రిల్ నుండి బి-టౌన్లో రామ్ చరణ్

Published on Feb 14, 2012 10:24 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్లో ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి రంగం సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్ నటించిన క్లాసిక్ చిత్రం ‘జంజీర్’ రీమేక్ లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రారంభం కానున్నట్లు సమాచారం. అపూర్వ లకియా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దీపిక పాడుకొనే హీరొయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అమితాబ్ బచ్చన్ జంజీర్ చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా నటించారు. ఈ చిత్రం ఆయన కెరీర్లో మైలు రాయిగా నిలిచింది. అలంటి పాత్రతో ప్రేక్షకులని రామ్ చరణ్ ఎంత వరకు మెప్పిస్తదనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు