
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తండ్రి మెగా స్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వరుస సినిమాలతో టాప్ లీగ్‌లో చేరిపోయిన స్టార్ హీరో! ప్రస్తుతం దర్శకుడు శ్రీనువైట్లతో ఓ భారీ సినిమా చేస్తోన్న చరణ్, ఈ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, స్టిల్స్ లాంటివేవీ విడుదల కాకపోవడంతో ఈ సినిమా చరణ్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయం అభిమానుల్లో ఆసక్తికరంగా కనిపిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే చెర్రీ సినిమాపై రకరకాల ఊహాగానాలు వెలువడుతూ వచ్చాయి.
ఇక నేటితో ఆ ఊహాగానాలన్నింటికి చెక్ పెడుతూ, చెర్రీ-శ్రీనువైట్ల సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(ఆగష్టు 22) సందర్భంగా ఈ సినిమా పోస్టర్స్‌తో పాటు చిన్న టీజర్‌ను కూడా విడుదల చేయనున్నారు. అయితే టీజర్‌తో పాటే టైటిల్ కూడా రిలీజ్ కానుందనే ప్రచారం జరిగినా, సినిమా యూనిట్ మాత్రం టైటిల్‌ను ఇప్పుడే అనౌన్స్ చేయడం లేదని తెలిపింది. దీంతో చెర్రీ సినిమా టైటిల్ కోసం మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. చిరు పుట్టినరోజు కానుకగా విడుదలకానున్న టీజర్ మాత్రం అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ కిందే లెక్క!
భారీ బడ్జెట్‌తో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరు ఓ అతిథి పాత్ర చేయనుండడం విశేషంగా కనిపిస్తోంది. గతంలో శ్రీనువైట్ల సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన కోన వెంకట్, గోపీ మోహన్‌లు మళ్ళీ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు.

