రామ్ చరణ్ ‘సిద్ద’మయ్యాడు

రామ్ చరణ్ ‘సిద్ద’మయ్యాడు

Published on Mar 1, 2021 8:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ విడుదలైంది. అభిమానులు, ప్రేక్షజకులు టీజర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మామూలుగానే మెగాస్టార్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందునా కొరటాల శివ డైరెక్షన్ అనడంతో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. పైపెచ్చు సినిమాలో సిద్ద అనే పాత్రలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండటం అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది.

గతంలో చిరు, చరణ్ కలిసి నటించినప్పటికీ కథ పరంగా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. అందుకే అందరిలోనూ ఇంత ఎగ్జైట్మెంట్. ఇక సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ కూడ నెలకొని ఉంది. ఈ విషయమై కొరటాల శివ కొద్దిసేపటి క్రితమే ఒక హింట్ ఇచ్చారు. చరణ్ స్టైల్ ఒక ధనాన్ని రిలీజ్ చేసి ఆచార్య ‘సిద్ద’మవుతున్నాడు అన్నారు. దీన్నిబట్టి మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదలచేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సో.. మెగా అభిమానులకు మార్చి 27న పెద్ద పండుగే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు