‘ఇస్మార్ట్ శంకర్’ కేవలం చిత్రం మాత్రమే కాదంటున్న రామ్

‘ఇస్మార్ట్ శంకర్’ కేవలం చిత్రం మాత్రమే కాదంటున్న రామ్

Published on Oct 25, 2019 7:20 PM IST

ismart

హీరో రామ్ సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న తరుణంలో చేసిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా సాధించిన విజయంతో రామ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆయనలోని ఎనర్జీని, నటుడ్ని పూర్తిస్థాయిలో తెరపై ఆవిష్కరించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ విజయంతో రామ్ కెరీర్ కొత్త టర్న్ తీసుకుని వేగం అందుకుంది.

అందుకే ఈ సినిమా అంటే రామ్ కు ప్రత్యేకమైన అభిమానం. ఈరోజుతో చిత్రం 100 రోజులకు చేరుకుంది. ఈ సందర్బంగా రామ్ ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. నా జీవితంలో ఒక కొత్త దశ. దీన్ని నేను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి అందమైన దశను ఇచ్చినందుకు పూరికి థాంక్స్. ఈ విజయాన్ని అందించిన అభిమానులు, ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు అన్నాడు. ఇకపోతే ఈ ఇస్మార్ట్ హీరో ప్రస్తుతం తమిళ సినిమా ‘తడం’ను తెలుగులోకి రీమేక్ చేసే పనిలో ఉన్నాడు.

తాజా వార్తలు