పూరి కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ !

Published on Feb 5, 2019 10:14 am IST

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి యువ హీరో రామ్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడట. ప్రపంచం లోనే అతి ఖరీదైన కాఫీ ‘కోపి లువక్’ ను రామ్ పూరికి గిఫ్ట్ గా ఇచ్చాడు. తాజాగా దాన్ని పూరి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఇక ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈచిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఇటీవల హైద్రాబాద్లో స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ లో గా ఈ సినిమా పూర్తి చేసి సినిమాను మే లో విడుదలచేయనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనేర్ లో రామ్ సరసన నిధి అగర్వాల్ , నాబా నటేష్ నటిస్తున్నారు. ఇక ఈ క్రేజీకాంభినేషన్ ఫై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :