ప్లేస్ ఒక్కటే సినిమాలు మాత్రం రెండు – రామ్

ప్లేస్ ఒక్కటే సినిమాలు మాత్రం రెండు – రామ్

Published on Jul 1, 2015 6:25 PM IST

Ram-Shivam
రీసెంట్ గా ‘పండగ చేస్కో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. రామ్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ రెండు సినిమాల షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేస్తున్న సినిమా ‘శివం’ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయ్యింది. ఇటీవలే శివం టీం ఊటీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ‘హరికథ’ కూడా హైదరాబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

రామ్ నటిస్తున్న శివం మరియు హరికథ సినిమాల లేటెస్ట్ షెడ్యూల్స్ రేపటి నుంచి వైజాగ్ లో ప్రారంభం కానున్నాయి. రామ్ రేపటి నుంచి రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉంటాడు. ఒకేసారి ఒకే ప్లేస్ లో జరుగుతున్న ఈ 2 సినిమాల కోసం రామ్ ఇక నుంచి డే అండ్ నైట్ రం షూటింగ్ చేయనున్నాడు. ఇప్పటికే రెండు టీమ్స్ వైజాగ్ చేరుకున్నాయి. శివంలో రామ్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంటే, హరికథ సినిమాలో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలను స్రవింతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తుంటే రెండు సినిమాలకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు