అమ్మాయిల హాస్టల్లో రామ్ గోపాల్ వర్మ !

Published on May 28, 2019 2:46 pm IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు విజయవాడకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన తన ఇంజనీరింగ్ విద్యను నగరంలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో అభ్యసించారు. తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రెస్ మీట్ కోసం విజయవాడ వెళ్లిన వర్మ చదువుకునే రోజుల్లో తాను నివసించిన హాస్టల్ భవనానికి కూడా వెళ్లారు.

అయితే అప్పట్లో అబ్బాయిల హాస్టల్‌గా ఉన్న భవనాన్ని నిర్వాహకులు ఇప్పుడు అమ్మాయిల హాస్టల్‌గా మార్చేశారు. అయినా వర్మ హాస్టల్‌లోనికి వెళ్లి తాను రెండేళ్లపాటు నివసించిన గదిని చూసుకుని అప్పట్లో తాను శ్రీదేవి పోస్టర్‌ను ఇష్టంగా అతికించుకున్న గోడ ఇదేనంటూ పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు ప్రజెంట్ అందులో ఉంటున్న విద్యార్థినిలకు సెల్ఫీలు కూడా ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More