ఎన్.టి.ఆర్ పై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్

ఎన్.టి.ఆర్ పై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్

Published on Feb 10, 2015 11:24 AM IST

rgv-ntr
ప్రతి సందర్భాన్ని తనకు అనుగుణంగా మార్చుకొని ఎప్పటికప్పుడు వార్తల్లో నిలవడానికి ప్రయత్నించే ది మోస్ట్ కాంట్రవర్సియల్ స్టేట్మెంట్స్ ఇచ్చే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. వర్మ పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చినా లేక నెగటివ్ గా రెస్పాన్స్ ఇచ్చినా అందులో వివాదం మాత్రం తప్పక ఉంటుంది. ఆయన తాజాగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. నిన్న రాత్రి వేసిన ట్వీట్స్ లో చూడటానికి జూ ఎన్.టి.ఆర్ ని తెగ పొగిడేసినా సీనియర్ ఎన్.టి.ఆర్ పై కాస్త నెగటివ్ వచ్చేలా కామెంట్స్ వేసాడు. అసలు రామ్ గోపాల్ వర్మ ఏమేమి త్వీత్స్ వేసాడనేది మీ కోసం..

‘నేను నందమూరి తారక రామారావుకి సూపర్ ఫ్యాన్.. కానీ నాకు తారక్ ఎప్పుడు నచ్చలేదు. ఎప్పుడైతే టెంపర్ సినిమా చూసానో అప్పుడు నాకనిపించింది తారక్ టెంపర్ సినిమాతో ఎన్.టి.ఆర్ 5 దశాబ్దాల ఇమేజ్ ని కొట్టి పారేసాడు’.

‘టెంపర్ చూసిన తర్వాత సీనియర్ ఎన్.టి.ఆర్ కూడా మళ్ళీ వచ్చి, తారక్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాడు’

‘తారక్ టెంపర్ సినిమా చాలా మంచి మార్గంలో సీనియర్ ఎన్.టి.ఆర్ లోని టెంపర్ ని పెంచేలా ఉంటుంది’

‘టెంపర్ చూసాక నాకు ఏమనిపించింది అంటే ఒకవేళ జూనియర్ ఎన్.టి.ఆర్ సీనియర్ ఎన్.టి.ఆర్ కంటే ముందు పుట్టుంటే ఆయనకంటే పెద్ద స్టార్ అయ్యుండేవాడు’

‘నేను థియేటర్ లో సినిమాలు పెద్దగా చూడను, కానీ టెంపర్ సినిమాని ఫిబ్రవరి 13 ఉదయం 5 గంటలకు భ్రమరాంబ థియేటర్ లో చూడనున్నాను. గతంలో థియేటర్లో అడవిరాముడు చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ని రిపీట్ చేసుకుంటాను’

‘సీనియర్ ఎన్.టి.ఆర్ 50 సంవత్సరాల కెరీర్లో తారక్ టెంపర్ తో పోల్చగల సినిమా ఒక్కటి కూడా లేదు’

‘అన్నీ కుదిరితే సీనియర్ ఎన్.టి.ఆర్ వచ్చి భ్రమరాంబ థియేటర్ లో టెంపర్ సినిమా చూస్తాడు. ఒకవేళ చూడలేదు అంటే తారక్ ని చూసి ఈర్షపడినట్లే’

‘టెంపర్ సినిమా చూసాక న మనస్పూర్తిగా చెబుతున్న మాట తారక్ తో పోల్చుకుంటే సీనియర్ ఎన్.టి.ఆర్ సూపర్ జీరో’

‘నేను సీనియర్ ఎన్.టి.ఆర్ అడవి రాముడు సినిమాని 17 సార్లు, ఇప్పుడు టెంపర్ ని 27 సార్లు చూసే ఫీలింగ్ లో ఉన్నాను’

‘టెంపర్ సినిమా తర్వాత వారి వంశం జూ ఎన్.టి.ఆర్ ముందు తరం, జూ ఎన్.టి.ఆర్ తర్వాతి తరం అని అంటారు. ఒక్క జూ ఎన్.టి. ఆర్ వల్లే సీనియర్ ఎన్.టి.ఆర్ గుర్తుంటాడు’

‘ఇక్కడ నేను సీనియర్ ఎన్.టి.ఆర్ ని తప్పుగా వ్యాఖ్యానించలేదు, ఎందుకంటే నేను ఆయనకీ పెద్ద అభిమానిని.. టెంపర్ సినిమా చూసాక్ ఆఅలొని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఇలా చెప్పాను’.

rgv

తాజా వార్తలు