మన తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఒక పాత్ బ్రేకింగ్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది కింగ్ నాగార్జున ఇంకా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో చేసిన చిత్రం “శివ” అని చెప్పొచ్చు. అప్పుడు వరకు వెళుతున్న ఓ ఫార్మాట్ ని బ్రేక్ చేసి ఆడియెన్స్ కి కొత్త ట్రీట్ ఇచ్చిన ఈ సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ మెమొరీస్ షేర్ చేసుకున్నారు.
ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో మాత్రం తనకి తన తండ్రి జన్మనిస్తే ఈ సినిమాతో కింగ్ నాగార్జున నన్ను నమ్మి అవకాశం ఇచ్చి మరో జన్మ ఇచ్చారు అని వర్మ తెలిపారు. అంతే కాకుండా ఆ సినిమా టైం లో జరుగుతున్న ఓ స్ట్రైక్ అప్పుడు ఆడియో పరంగా ఇబ్బంది అవుతుంది బొంబాయి వెళ్లి పనులు చేయించుకోవాలి అన్నపుడు నాగ్ తన రెమ్యునరేషన్ అయినా తగ్గించుకోండి కానీ పని మాత్రం ఆగకూడదు అని చెప్పినట్టు ఆర్జీవీ తెలిపారు.
అప్పటికి తన విజన్ ని అంతలా నాగార్జున నమ్మారు కాబట్టే అంతా సాధ్యం అయ్యింది అని కింగ్ కే ఆ క్రెడిట్ ని అందించారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన శివ సినిమా రీరిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.
