ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఫిట్నెస్ ఛాలెంజ్ తో ఊగిపోతోంది. కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్టార్ట్ చేసిన ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ కార్యక్రమాన్ని ఎక్కువగా సినిమా హీరోలు ప్రమోట్ చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా తెలుగు ఇండస్ట్రీ లో ఈ ఛాలెంజ్ లు ఎక్కువయ్యాయి.
టాప్ హీరోలతో పాటు యువ కథానాయకులు ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఇంతకుముందు హీరో కళ్యాణ్ రామ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కి రామ్ ను నామినెట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న రామ్ ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసిన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చాక్ లెట్ బాయ్ గా పిలవబడే రామ్ కండలు పెంచి ఫిట్ గా కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది .
ప్రస్తుతం ఈ హీరో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో నటిస్తున్నాడు. సెప్టెంబర్లో ఈ చిత్రంతో మన ముందుకు రానున్నాడు రామ్.
As Promised..Thank you @NANDAMURIKALYAN brother for nominating me.. Now, I’d like to nominate all my dearest Fans n followers..Go Kill it & post the videos..I’d love to see em! #Love – R.A.P.O #humfittohindiafit pic.twitter.com/DWFlcR0lr3
— RAm POthineni (@ramsayz) June 7, 2018


