రామ్ మూవీ హిందీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

రామ్ మూవీ హిందీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

Published on Sep 2, 2019 9:35 PM IST

హీరో రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత జంటగా దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “హలో గురు ప్రేమకోసమే”. గత ఏడాది అక్టోబర్ లో విడుదలైన ఈ చిత్రం తెలుగులోమంచి చిత్రంగా నిలిచింది. కాగా ఈ చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులను ఆదిత్య మూవీస్ సొంతం చేసుకోవడం జరిగింది. ఐతే ఈ చిత్ర హిందీ వర్షన్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

దమ్ దార్ కిలాడీ పేరుతో యూట్యూబ్ లో విడుదలైన ఈ చిత్రం 100 మిల్లియన్స్ వ్యూస్ సాధించింది. అలాగే 8లక్షలకు పైగా లైక్స్ సాధించి అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతుంది. ఈ చిత్రం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన 56 రోజులలోనే 100 మిల్లియన్స్ మార్క్ చేరుకోవడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు